Thursday, 12 December 2013

ప్రేమ ప్రమిద...



ఇరు హృదయాలు ఆలపించే మధుర గానమిది
ఒకే పల్లవితో మొదలయ్యే వసంత గీతమిది

హంసధ్వనై హద్దులు చెరిపే ప్రణయ వంతెనిది
చైత్ర చలిగాలుల్లో ఎదురుచూసే విరహ వేదనిది

హృదయ సితారలు చేసే ప్రేమ పదవిన్యాసమిది
ఎడబాటు సుమతారలై వెలిగే నిత్య ప్రమిదిది

తలపు హరివిల్లై మురిపించే తీయని కలయిది
వలపు విరిజల్లై కురిపించే వెచ్చని కలయికిది

విశ్వం మాయ కోసమై అల్లిన ఊహా పొదరిల్లిది
మాయ విశ్వం కోసమై కట్టిన కలల కుటీరమిది



Friday, 6 December 2013

మదిసవ్వడి


మధురభావాల సుమమాల ఇది
ఇరుమనసుల కలయికకు నాంది

తనకి నేను నాకోసం తనే పలికెడి
పదాలలో ఇద్దరిది ఒకటే ఒరవడి

వాస్తవాలకందని కలలకుటీరమిది
మమతలే తప్ప మర్మమెరుగనిది

రెండు మనసులు పెనవేసిన ముడి
చిలిపిగా చేస్తున్న అలజడులసవ్వడి

అందరినీ అలరించే ప్రయత్నం మాది
అవునని కాదనో చెప్పే నిర్ణయం మీది