Friday, 6 December 2013

మదిసవ్వడి


మధురభావాల సుమమాల ఇది
ఇరుమనసుల కలయికకు నాంది

తనకి నేను నాకోసం తనే పలికెడి
పదాలలో ఇద్దరిది ఒకటే ఒరవడి

వాస్తవాలకందని కలలకుటీరమిది
మమతలే తప్ప మర్మమెరుగనిది

రెండు మనసులు పెనవేసిన ముడి
చిలిపిగా చేస్తున్న అలజడులసవ్వడి

అందరినీ అలరించే ప్రయత్నం మాది
అవునని కాదనో చెప్పే నిర్ణయం మీది

11 comments:

  1. "మాయావిశ్వం" మీకు బ్లాగ్ లోకానికి స్వాగతం....మీ మనోభావాలతో అలరిస్తారని ఆశ :-)

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలండి. మొదటి కామెంట్ తోనే ఉత్తెజపరిచారు.. మీ ఆదరణ సదా ఉండాలని ఆశ.

      Delete
  2. Beautiful feel!

    ReplyDelete
    Replies
    1. త్యాంక్యు! అనూ గారు.. వెల్కం టు ' మాయా విశ్వం '

      Delete
  3. మొదటి పోస్ట్ నుంచే ' మాయావిశ్వం' ల మది భావాలను ఆస్వాదించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. ఇలానే ఎప్పటికీ ఆస్వాదిస్తారనే చిన్ని ఆశను మన్నిస్తారు కదూ... - మీ మాయావిశ్వం

    ReplyDelete
  4. మీ బ్లాగ్ చాలా బాగుంది

    ReplyDelete