ఇరు హృదయాలు ఆలపించే మధుర గానమిది
ఒకే పల్లవితో మొదలయ్యే వసంత గీతమిది
హంసధ్వనై హద్దులు చెరిపే ప్రణయ వంతెనిది
చైత్ర చలిగాలుల్లో ఎదురుచూసే విరహ వేదనిది
హృదయ సితారలు చేసే ప్రేమ పదవిన్యాసమిది
ఎడబాటు సుమతారలై వెలిగే నిత్య ప్రమిదిది
తలపు హరివిల్లై మురిపించే తీయని కలయిది
వలపు విరిజల్లై కురిపించే వెచ్చని కలయికిది
విశ్వం మాయ కోసమై అల్లిన ఊహా పొదరిల్లిది
మాయ విశ్వం కోసమై కట్టిన కలల కుటీరమిది
అందమైన ప్రేమకావ్యమిది
ReplyDeleteచాలాబాగుంది
ReplyDeleteచాలాబాగుంది
ReplyDeleteమీ కలల కుటీరంలో మీ కవితాగానం బాగుంది విశ్వంజీ..
ReplyDeleteఅందమైన స్వప్న ఊహాలోకం
ReplyDeleteబాగుంది ప్రేమ ప్రమిద.....దేదీప్యమానంగా వెలగనీయండి
ReplyDeleteVery Interesting:-)
ReplyDeleteప్రేమ సరాగాలు బాగున్నాయి
ReplyDeleteవిశ్వం లో ఇంత మాయ ఉందా...
ReplyDelete